Ram Gopal Varma: మనిషి మరణిస్తే బాధపడొద్దు.. సెలబ్రేట్ చేసుకోవాలి..: వర్మ

Ram Gopal Varma (tv5news.in)

Ram Gopal Varma (tv5news.in)

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఒక సెన్సేషన్.. ఆయన ఏం మాట్లాడిన ఓ కాంట్రవర్సీ.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఒక సెన్సేషన్.. ఆయన ఏం మాట్లాడిన ఓ కాంట్రవర్సీ. ముఖ్యంగా ట్విటర్‌లో వర్మ వ్యక్తపరిచే అభిప్రాయాలకు, వాటికి వచ్చే కామెంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే తాజాగా గాన కోకిల లతా మంగేష్కర్ మరణించడంతో సినిమా పరిశ్రమ అంతా విషాదంలో మునిగిపోయింది. అలా మనిషి చనిపోతే బాధపడొద్దు అంటూ కొత్త లాజిక్‌ను చెప్తున్నారు ఆర్జీవి.

'ఒక మనిషి చనిపోతే.. ఆర్‌ఐపీ అని చెప్పడం వారిని అవమానించడమే. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేవారిని బద్ధకస్తులు అంటుంటారు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఆర్‌ఐపీ అని చెప్పకుండా మంచి జీవితంలో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చెయ్యి' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ కొత్త లాజిక్‌ను విని ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో పాటు ట్విటర్ వేదికగా ఆర్జీవి మరో లాజిక్ కూడా భోదించారు.


'ఒక మనిషి చనిపోయినప్పుడు అందరు బాధపడి ఒక మంచి మనిషి చనిపోయారు అనుకుంటారు. కానీ అది మూర్ఖత్వం. ఒక మంచి మనిషి ఇంతకంటే మంచి ప్రదేశానికి వెళ్లారు కాబట్టి బాధపడకుండా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ చనిపోయింది మంచి వ్యక్తి కాకపోతే ఇంక బాధపడి ఏం లాభం..?' అంటూ వర్మ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.


Tags

Read MoreRead Less
Next Story