Rashmika Mandanna: మరో పాన్ ఇండియా సినిమాలో రష్మిక.. తమిళ స్టార్‌తో..

Rashmika Mandanna (tv5news.in)

Rashmika Mandanna (tv5news.in)

Rashmika Mandanna: హిందీలో ఛాన్సులు అందుకుంటున్న రష్మిక.. తాజాగా ఓ తమిళ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుందని సమాచారం.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందనా.. ప్రస్తుతం చాలావరకు పాన్ ఇండియా సినిమాలకే సైన్ చేస్తూ ముందుకెళ్తోంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా ఈ భామ.. హవా చూపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరోలను చుట్టేస్తూ.. బీ టౌన్‌లో కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే రష్మిక ఇంకో పాన్ ఇండియా సినిమా చేస్తుందంటూ టాక్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో ఈ మూవీ కలెక్షన్స్ స్లోగా స్టార్ట్ అయినా కూడా తరువాత బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అయితే ఇందులో శ్రీవల్లి పాత్రతో రష్మిక హిందీలో ఫేమస్ అయిపోయింది. అలా హిందీలో ఛాన్సులు అందుకుంటున్న రష్మిక.. తాజాగా ఓ తమిళ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుందని సమాచారం.

త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ ఓ సినిమా చేయనున్నాడు. ముందుగా ఇది కేవలం తెలుగు, తమిళంలోనే విడుదల కానుందని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఇది పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో హీరోయిన్‌గా రష్మిక ఎంపికయిందట. ప్రస్తుతం పూజా హెగ్డేతో 'బీస్ట్' సినిమా చేస్తున్న విజయ్.. రష్మికతో కూడా జతకట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story