RRR Collection In US: ఒక్కరోజులోనే అమెరికాలో ఆ రికార్డ్ క్రియేట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'..

RRR Collection In US: ఒక్కరోజులోనే అమెరికాలో ఆ రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్..
RRR Collection In US: ముందుగా అమెరికాలో ప్రీమియర్ షో పడిన దగ్గర నుండే ఆర్ఆర్ఆర్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది.

RRR Collection In US: 'ఆర్ఆర్ఆర్' మ్యానియా దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు. కొన్ని ప్రాంతాల్లో టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. టికెట్లు దొరికిన వారు సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అమెరికాలో కేవలం ప్రీమియర్ షోస్‌తోనే ఆర్ఆర్ఆర్ అన్ని రికార్డులను తిరగరాస్తోంది.

ముందుగా అమెరికాలో ప్రీమియర్ షో పడిన దగ్గర నుండే ఆర్ఆర్ఆర్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూ రావడం కూడా సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. బాహుబలి లాంటి భారీ స్థాయి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన దర్శకుడి దగ్గర నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలని ఆశపడ్డారు. ఆర్ఆర్ఆర్ అలాగే ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్‌కు ప్రత్యేకంగా టికెట్ ధరలను పెంచాయి ప్రభుత్వాలు. అలాగే అమెరికాలో కూడా ఒక్కొక్క టికెట్‌కు ఎక్కువ ప్రైజ్‌నే పెట్టి కొన్నారు ప్రేక్షకులు. అమెరికాలో నిన్న రాత్రి నుండి ప్రీమియర్స్ మొదలయ్యాయి. కేవలం ప్రీమియర్స్‌తోనే 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది ఆర్ఆర్ఆర్. 981 లొకేషన్లలో 12 గంటల లోపు ఈ మార్క్‌ను టచ్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story