RRR collections : బాక్సాఫీస్ వద్ద ఊచకోత.. అయిదు రోజుల్లో RRR అదిరిపోయే కలెక్షన్లు..!

RRR collections :  బాక్సాఫీస్ వద్ద ఊచకోత.. అయిదు రోజుల్లో RRR అదిరిపోయే కలెక్షన్లు..!
RRR collections : బాహుబలి మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR)..

RRR collections : బాహుబలి మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR).. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్‌‌గా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది ఈ చిత్రం.

విడుదలైన అయిదు రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్‌‌గా రూ. 625 కోట్లు (గ్రాస్) వసూళ్ళు సాధించింది. రిలీజైన మొదటిరోజు శుక్రవారం రోజున రూ. 235 కోట్లు వసూళ్ళు చేసిన ఈ మూవీ.. ఆ తర్వాత శనివారం రూ. 121 కోట్లు, ఆదివారం రూ. 140 కోట్లు, సోమవారం రూ. 69 కోట్లు, మంగళవారం రూ. 60 కోట్లు సాధించింది.

ఇక ఏపీ తెలంగాణలో ఈ సినిమా రూ. 253 కోట్లు కొల్లగొట్టగా, హిందీలో రూ. 100 కోట్లు సాధించింది. కాగా రూ. 450 కోట్లతో తెరకెక్కన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా, రామ్ చరణ్ అల్లూరిగా నటించి మెప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story