RRR Movie : RRR ఖాతాలో మరో రికార్డు..!

RRR Movie : RRR ఖాతాలో మరో రికార్డు..!
RRR Movie : రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

RRR Movie : రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఐదో వారంలోకి ఎంటర్ అయిన ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

బాహుబలి 2 మూవీ తర్వాత ఈ స్థాయిలో వసూళ్ళు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి మెప్పించారు. డీవీవీ దానయ్య తెరకెక్కించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

ఇక ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత వసూళ్ళు సాధిస్తోందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story