RRR Release : RRR రిలీజ్ డేట్ ఫిక్స్..!

RRR Release : RRR రిలీజ్ డేట్ ఫిక్స్..!
RRR Release : ఇప్పుడు ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు టోటల్ ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తోన్న చిత్రం RRR..

RRR Release : ఇప్పుడు ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు టోటల్ ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తోన్న చిత్రం RRR.. బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తోన్న తదుపరి చిత్రం కావడంతో RRR పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీనికి తోడు టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం సినిమాకి మరో బిగ్ క్రేజ్.

కరోనా వలన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి అన్నీ థియేటర్లు పూర్తి సామర్ధ్యం మేరకు ప్రేక్షకులు అనుమతి ఇస్తే మార్చి 18న రిలీజ్ చేస్తామని అనౌన్సు చేశారు మేకర్స్. పరిస్థితులు ఇలా లేకపోతే ఏప్రిల్ 28న మూవీని రిలీజ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

కాగా ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించింది.


Tags

Read MoreRead Less
Next Story