Bheemla Nayak: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. రిలీజ్ ఎప్పుడంటే..?

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా నాయక్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Bheemla Nayak: భీమ్లా నాయక్ డిజిటల్ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకుంది. దీనికోసం ఆహా వారు చాలానే ఖర్చు పెట్టినట్టు సమాచారం.

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో తన ఫేవరెట్ హీరో ఒక మాస్ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత 'వకీల్ సాబ్'గా ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్‌ను అందుకున్నా కూడా తన ఫ్యాన్స్ కోరుకున్న మాస్ యాంగిల్‌ అందులో కనిపించలేదు. అయితే 'భీమ్లా నాయక్'తో వారి కోరిక తీరిపోయింది.

సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీ మొదటిరోజు నుండే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే చాలావరకు లాభాల్లోకి వెళ్లిపోయిన భీమ్లా నాయక్ చూడడానికి ఇంకా ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టరైజేషన్‌లు, త్రివిక్రమ్ డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్‌గా మారాయి. అయితే భీమ్లా నాయక్ త్వరలోనే ఓటీటీలోకి రానుందని ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.

ఓటీటీ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు తక్కువ బడ్జెట్ సినిమాలు నేరుగా అందులోనే విడుదల అవుతున్నాయి. అంతే కాకుండా ఎంత సూపర్ హిట్ సినిమా అయినా.. నెలన్నర లోపు ఓటీటీలోకి వచ్చేస్తోంది. అందుకే భీమ్లా నాయక్ ఇంకా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తున్నా కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని చర్చ మొదలయిపోయింది.

భీమ్లా నాయక్ డిజిటల్ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకుంది. దీనికోసం ఆహా వారు చాలానే ఖర్చు పెట్టినట్టు సమాచారం. అయితే ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలయిన భీమ్లా నాయక్.. మార్చి చివర్లో ఓటీటీలో విడుదల కానున్నట్టు సమాచారం. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ సాధించిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story