Sai Pallavi: సాయి పల్లవిపై ట్రోలింగ్.. నటికి గవర్నర్ తమిళిసై సపోర్ట్..

Sai Pallavi: సాయి పల్లవిపై ట్రోలింగ్.. నటికి గవర్నర్ తమిళిసై సపోర్ట్..
Sai Pallavi: శ్యామ్ సింగరాయ్‌లోని సాయి పల్లవి పాత్రపై వస్తున్న నెగిటివిటీపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు.

Sai Pallavi: శ్యామ్ సింగరాయ్‌లో సాయి పల్లవి చేసిన దేవదాసి పాత్ర.. ఇదొక లైఫ్ టైమ్ గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇదే విషయాన్ని సాయి పల్లవి కూడా స్పష్టం చేసింది. సాయి పల్లవి ఏ సినిమాలో నటించిన అందులో ఇతర నటీనటులకు భిన్నంగా తన మార్క్‌ను క్రియేట్ చేస్తుంది. అలాంటి తన నటనతోనే చాలామంది అభిమానులను సంపాదించుకుంది. కానీ అలాంటి సాయి పల్లవిపై కూడా ట్రోలింగ్ మొదలయ్యింది. దానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా తెలుగుతో ఇతర భాషల్లో కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలయ్యింది. సాయి పల్లవికి మాత్రమే కాదు.. నానికి కూడా తమిళంలో బాగానే ఫాలోయింగ్ ఉండడంతో అక్కడ కూడా సినిమా పాజిటివ్ టాక్‌నే సంపాదించింది. చాలామంది సాయి పల్లవి పాత్రను పొగిడితే.. ఒక్క తమిళ మీడియా మాత్రం ఆ పాత్రకు సాయి పల్లవి సూట్ అవ్వలేదని రాసింది. ఆ వార్తను చాలామంది ప్రేక్షకులు ఖండించారు కూడా.

ఇక శ్యామ్ సింగరాయ్‌లోని సాయి పల్లవి పాత్రపై వస్తున్న నెగిటివిటీపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు. సాయి పల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం తనను చాలా బాధించిందన్నారు తమిళిసై. గతంలో తన రూపాన్ని కూడా ట్రోల్ చేసేవారని గుర్తుచేసుకున్నారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుందని, ఆ విషయంలో తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు. తన ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఆ ట్రోలింగ్స్ కచ్చితంగా బాధను కలిగిస్తాయని అన్నారు తమిళిసై.

Tags

Read MoreRead Less
Next Story