Sai Pallavi: అప్పుడు వదులుకున్న పాత్రలో మళ్లీ సాయి పల్లవి.. స్టార్ హీరో చెల్లెలిగా..

Sai Pallavi (tv5news.in)

Sai Pallavi (tv5news.in)

Sai Pallavi: ఈ మధ్య త్రివిక్రమ్ ప్రతీ సినిమాలో కామన్‌గా ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు.

Sai Pallavi: ఒక సినిమా చేయాలంటే అందులో తన పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాన్ని కీలకంగా చూసే నటి సాయి పల్లవి. కథ, అందులో తన పాత్ర.. వీటికే సాయి పల్లవి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విషయాన్ని తానే చాలాసార్లు బయటపెట్టింది. అందుకే ప్రస్తుతం ఓ స్టార్ హీరో పక్కన చెల్లెలి లాగా చేయడానికి కూడా సిద్ధమయ్యింది. ఈ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది.

సాయి పల్లవి సినిమాల సెలక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో టాలీవుడ్‌లో ఓ ఇంపాక్ట్ క్రియేట్. మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో సైతం ఆయన సినిమాల్లో సాయి పల్లవి ఉంటే బాగుంటుందని సంప్రదించినా తిరస్కరించింది. చెల్లెలి పాత్రలు కావడంతో సాయి పల్లవి ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అనుకున్నారంతా. కానీ రీమేక్ కథలు తాను చేయకూడదని ఎప్పుడో డిసైడ్ అయినట్టు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి చెల్లెలి పాత్ర తనను వెతుక్కుంటూ వచ్చింది.


ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో బిజీగా ఉన్నాడు. టీమ్‌లో చాలామందికి కరోనా నిర్దారణ కావడంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళితో చిత్రాన్ని ఖరారు చేశాడు మహేశ్. కానీ దానికంటే త్రివిక్రమ్‌తో మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నాడట సూపర్ స్టార్. ఇందులో ఓ కీలక పాత్రలో సాయి పల్లవి కూడా కనిపించనున్నట్టు టాక్.



ఈ మధ్య త్రివిక్రమ్ ప్రతీ సినిమాలో కామన్‌గా ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. ఇప్పటికే మహేశ్ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖరారయ్యింది. తనతో పాటు సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఇందులో సాయి పల్లవిది మహేశ్ చెల్లెలి పాత్ర అని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది ఎలాగో రీమేక్ చిత్రం కాకపోవడంతో కథ నచ్చితే మహేశ్‌కు చెల్లిగా నటించడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story