Salaar: ప్రభాస్ 'సలార్'కు కొత్త కష్టాలు.. రెండు భాగాలుగా విడుదల చేయక తప్పదా..?

Salaar: ప్రభాస్ సలార్కు కొత్త కష్టాలు.. రెండు భాగాలుగా విడుదల చేయక తప్పదా..?
Salaar: సలార్ కూడా బాహుబలి, కేజీఎఫ్‌లాగానే రెండు భాగాల్లో విడుదల అవుతుందని రూమర్స్ వచ్చాయి.

Salaar: ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్, అవి తెచ్చిపెట్టే కలెక్షన్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ 'బాహుబలి' విడుదల తర్వాత తెలుగు సినిమా రేంజే మారిపోయింది. ఈ మూవీ ప్రభాస్ రేంజ్‌నే మార్చేసింది. యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల బడ్జెట్ అంతా కలిపితే 1000 కోట్లపైనే ఉంటుంది. అయితే తన సినిమా వల్ల ఓ నిర్మాత చాలా ఇబ్బందులు పడుతున్నాడంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్‌లో పక్కా ప్లానింగ్ ఉండాలి. కాస్త అటు, ఇటు అయినా.. బడ్జెట్ నిర్మాత చేయి దాటిపోతుంది. ఒకవేళ సినిమా బిజినెస్ బాగా జరిగితే.. బడ్జెట్‌ను మించిన లాభాలు వెనకేసుకోవచ్చు. అదే కొంచెం ఫ్లాప్ టాక్ వచ్చిన నిర్మాత మార్కెట్ అమాంతం పడిపోతోంది. ప్రస్తుతం కొన్ని పాన్ ఇండియా సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ప్రభాస్.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'సలార్'. అయితే ఇప్పటికే సలార్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సలార్ కూడా బాహుబలి, కేజీఎఫ్‌లాగానే రెండు భాగాల్లో విడుదల అవుతుందని రూమర్స్ వచ్చినా.. మూవీ టీమ్ మాత్రం అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ప్రస్తుతం వచ్చిన కొత్త సమస్యతో సలార్ టీమ్ కన్ఫ్యూజన్‌లో పడిందట.

మామూలుగా సలార్ బడ్జె్ట్‌ను 200 కోట్లు అనుకున్నారట. కానీ చాలాసార్లు షూటింగ్స్‌కు బ్రేక్ పడడంతో.. ప్రస్తుతం షూటింగ్ ఇంకా చాలా పూర్తికావాల్సి ఉండడంతో.. బడ్జెట్ ఇంకా లిమిట్‌ను మించిపోయేలా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత బడ్జెట్ పెట్టిన తర్వాత దానికి తగినట్టుగా లాభాలు రావాలంటే.. సలార్ కూడా రెండు భాగాలుగా విడుదల కావాల్సిందే అని కొందరు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి దీనిపై మూవీ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Tags

Read MoreRead Less
Next Story