Samantha : 'నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నాడు'.. మరో షాకిచ్చిన సామ్..!

Samantha : నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నాడు..  మరో షాకిచ్చిన సామ్..!
Samantha : టాలీవుడ్ స్టార్ కపుల్‌‌గా ఓ వెలుగు వెలిగిన అక్కినేని నాగచైతన్య, సమంత తమ నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత వీడ్కోలు పలికారు..

Samantha : టాలీవుడ్ స్టార్ కపుల్‌‌గా ఓ వెలుగు వెలిగిన అక్కినేని నాగచైతన్య, సమంత తమ నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత వీడ్కోలు పలికారు.. గతేడాది అక్టోబర్ 2న ఇద్దరు విడిపోతున్నట్టుగా ఉమ్మడి ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇప్పటికి వీరిద్దరు విడిపోవడానికి కారణాలు ఎవరికీ కూడా తెలియవు.. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ రోకా వేడుకకి చైసామ్ హాజరయ్యారు.

అప్పుడు దిగిన ఓ పిక్‌‌ని తన ఇన్‌‌‌స్టా‌‌గ్రామ్‌‌లో సామ్ పోస్ట్ చేస్తూ.. " మ‌మ్మీ, ఆంటీస్‌, ఫ్రెండ్స్, సిస్టర్స్ అంద‌రిని పంపిన త‌ర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ టైం వ‌చ్చింది. నా భ‌ర్త చాలా అందంగా క‌నిపిస్తున్నారు క‌దా?( భ‌ర్త ఎక్కడో పెద్ద గొయ్యి త‌వ్వుతున్నాడు) " అంటూ ఫ‌న్నీ కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన చైతన్య.. ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు.


అయితే ఈ పోస్ట్ ను సామ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి డిలిట్ చేసింది. కాగా కొద్దిరోజుల క్రితం విడాకుల ప్రకటనను కూడా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసేసింది.

Tags

Read MoreRead Less
Next Story