Samantha Ruth Prabhu: మళ్లీ రెమ్యునరేషన్ పెంచేసిన సామ్.. ఆ సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్లు..

Samantha Ruth Prabhu: మళ్లీ రెమ్యునరేషన్ పెంచేసిన సామ్.. ఆ సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్లు..
Samantha Ruth Prabhu: ‘పుష్ప’లోని ఐటెమ్ సాంగ్ కోసం కాసేపటికే రూ. 1.5 కోట్లు తీసుకుంది సమంత.

Samantha Ruth Prabhu: సమంత రుత్ ప్రభు.. సౌత్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్లు తను కూడా ఒకరు. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్నాళ్ల క్రితం తన కెరీర్ ముగిసిపోయినట్టే అని చాలామంది అనుకున్నారు. వారందరికీ సమాధానంగా సమంత మరిన్ని సినిమాలతో బిజీ అయిపోయింది. అంతే కాకుండా తన అప్‌కమింగ్ సినిమాల కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట సమంత.


సమంత హీరోయిన్‌గా నటించిన సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక తమిళ చిత్రం కూడా ఉంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన 'కాతువాకుల రెండు కాదల్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు తెలుగులో 'శాకుంతలం' సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసిన తర్వాత సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రిలీజైన కాసేపట్లోనే యూట్యూబ్‌లో ఈ పాట రికార్డులను బద్దలుకొట్టింది. అంతే కాకుండా సమంత క్రేజ్ ప్రస్తుతం హాలీవుడ్ వరకు వెళ్లనుంది. ఇప్పటికే 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంగ్లీష్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత ఏకంగా రూ. కోటి రెమ్యునరేషన్‌ను పెంచేసిందట.


'పుష్ప'లోని ఐటెమ్ సాంగ్ కోసం కాసేపటికే రూ. 1.5 కోట్లు తీసుకున్న సమంత.. తన తరువాతి చిత్రం 'యశోద' కోసం ఏకంగా రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తుందట. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల కోసం సమంత రెమ్యునరేషన్ రూ. 2 కోట్లు కాగా ఇప్పుడు ఏకంగా రూ. కోటి పెంచేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story