Samantha Ruth Prabhu: పెళ్లి చీర గురించి సమంత షాకింగ్ నిర్ణయం..

Samantha Ruth Prabhu: పెళ్లి చీర గురించి సమంత షాకింగ్ నిర్ణయం..
Samantha Ruth Prabhu: సమంత మాత్రం అక్కినేని కుటుంబం నుండి ఎలాంటి భరణం తీసుకోవడానికి ఇష్టపడలేదు

Samantha Ruth Prabhu: టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత.. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోయారు. అయితే వారి విడాకుల గురించి ప్రకటించి కూడా ఇప్పటికీ అయిదు నెలలు అయిపోయింది. అయినా ఇంకా ఈ విషయాన్ని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. తాజాగా సమంత పెళ్లి చీర గురించి మరోసారి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.


సమంత, నాగచైతన్య ముందుగా హిందూ సాంప్రదాయంలో, ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లినాడు సమంత చీర అందరి దృష్టిని ఆకర్షించింది. దీని విలువ లక్షల్లో ఉంటుందని కథనాలు కూడా వచ్చాయి. అంతే కాకుండా ఇది నాగచైతన్య అమ్మమ్మది అని కూడా సమాచారం. అయితే ఈ చీర అక్కినేని కుటుంబానికి సంబంధించింది కావడంతో దీనిపై సమంత ఓ నిర్ణయం తీసుకుందట.


మామూలుగా విడాకుల తర్వాత భరణం తీసుకోవడం అనేది సహజం. కానీ సమంత మాత్రం అక్కినేని కుటుంబం నుండి ఎలాంటి భరణం తీసుకోవడానికి ఇష్టపడలేదని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అలాగే అక్కినేని కుటుంబానికి చెందిన ఏ వస్తువు తన దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్న సమంత.. పెళ్లి చీర కూడా తిరిగి ఇచ్చేయాలనుకుంటుందని సమాచారం. అంతే కాకుండా ఆ చీరను తిరిగి ఇచ్చేసిందంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story