Samantha : క్రేజీ ప్రాజెక్ట్‌‌లో సామ్.. విజయ్‌‌తో వన్స్ మోర్..!

Samantha : క్రేజీ ప్రాజెక్ట్‌‌లో సామ్.. విజయ్‌‌తో  వన్స్ మోర్..!
Samantha : నాగచైతన్యతో విడాకులు తర్వాత టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది.

Samantha : నాగచైతన్యతో విడాకులు తర్వాత టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది. ఇప్పటికే శాకుంతలం సినిమాని ఫినిష్ చేసిన సామ్.. అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసి అలరించింది. ఇప్పుడు యశోద మూవీతో పాటుగా ఓ హాలీవుడ్ మూవీకి కమిట్ అయింది సమంత.

ఇదిలావుండగా సామ్ ఇప్పుడో బంపర్ ఆఫర్ కొట్టేసిందని తెలుస్తోంది. అప్పుడెప్పుడో అనౌన్స్ అయిన విజయ్ దేవకొండ, శివ నిర్వాణల సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు.. ఇటు లైగర్ మూవీ కంప్లీట్ చేసిన విజయ్.. పూరితో జనగణమన మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వగా, ప్రస్తుతం లొకేషన్‌ సెర్చ్‌ జరుగుతోంది.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని అనుకున్నారు కానీ ఫైనల్ గా ఆ ఆఫర్ సమంతకి వద్దకి వచ్చిందట. సినిమాకి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన పూరి సినిమాని యమ స్పీడ్ గా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కాగా సమంత, విజయ్ దేవరకొండలు ఇప్పటికే మహానటి సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story