Shamita Shetty: బిగ్ బాస్‌లో ప్రేమ.. త్వరలో పెళ్లి.. ఇంతలో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన నటి..

Shamita Shetty: బిగ్ బాస్‌లో ప్రేమ.. త్వరలో పెళ్లి.. ఇంతలో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన నటి..
Shamita Shetty: బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా షమితా శెట్టి, రాకేశ్ బాపత్‌లు రిలేషన్‌లోనే ఉన్నారు.

Shamita Shetty: బిగ్ బాస్ హౌస్ అంటేనే భిన్న మనస్తత్వాలు ఉన్న కొందరు ఒకేచోట కలిసి ఉండడం. అందులో ఉండేవారికి టైమ్ ఎంత అయ్యిందో తెలియదు. బయటవారితో మాట్లాడే వెసులుబాటు ఉండదు. అందుకే వారిలో వారు కొట్టుకుంటారు. వారిలో వారే తిట్టుకుంటారు. మళ్లీ వారిలో వారే కలిసిపోతారు కూడా. అందుకే బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమకథలు కూడా చిగురిస్తూ ఉంటాయి. అలా మొదలైన ఓ ప్రేమకథే షమితా శెట్టి, రాకేశ్‌ బాపత్‌‌ది.


శిల్పా శెట్టి అంటే ఇప్పటికీ చాలామంది కలల రాకుమారే. హిందీలోనే కాదు సౌత్‌లో కూడా పలు సినిమాలు చేసి పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే తన తర్వాత తనలాగా సినిమాల్లో రాణించాలని తన చెల్లెలు షమితా శెట్టిని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. కానీ శిల్పా శెట్టిలాగా షమితా శెట్టి పాపులారిటీని సంపాదించుకోలేకపోయింది.


సినిమాల్లో రాణించలేకపోయినా.. షమితా శెట్టి మాత్రం శిల్పా శెట్టి చెల్లెలిగా కొంత గుర్తింపును అయితే సొంతం చేసుకుంది. అలాగే తనకు బిగ్ బాస్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. బిగ్ బాస్ ఓటీటీలో ఒక కంటెస్టెంట్‌గా వెళ్లిన షమితా శెట్టి.. అక్కడే రాకేశ్ బాపత్‌తో ప్రేమలో పడింది. అయితే ఇది కూడా కొంతకాలమే అనుకున్నారు చాలామంది. కానీ కాదని బయటికి వచ్చాకే తెలిసింది.


బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా షమితా శెట్టి, రాకేశ్ బాపత్‌లు రిలేషన్‌లోనే ఉన్నారు. పైగా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా వీరు బ్రేకప్ అయినట్టు గత కొన్నిరోజులుగా బాలీవుడ్ సర్కి్ల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అదంతా నిజం కాదని షమితా, రాకేశ్ వారి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story