Shannu And Deepthi: ఇంట్లోవారి ఒత్తిడి వల్లే బ్రేకప్.. షణ్నూ క్లారిటీ..

Shannu And Deepthi: ఇంట్లోవారి ఒత్తిడి వల్లే బ్రేకప్.. షణ్నూ క్లారిటీ..
Shannu And Deepthi: తాజాగా ఓ షోలో పాల్గొన్న షణ్నూ వారి బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు.

Shannu And Deepthi: బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎవ్వరి లైఫ్‌ను అయినా మర్చేస్తుంది అంటే ఆశ్చర్యం లేదు. ఈ షో ఎంతోమందికి ఫేమ్ తెచ్చిపెట్టింది. మరికొందరికి ఉన్న ఫేమ్‌ను పోగొట్టింది. షార్ట్ ఫిల్మ్స్‌తో, వెబ్ సిరీస్‌లతో, డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయ్యి తనకంటూ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న షణ్నూ పర్సనల్ లైఫ్ బిగ్ బాస్ కారణంగా పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం ఏంటో ఇటీవల బయటపెట్టాడు.

బిగ్ బాస్‌లో షణ్నూ ఎక్కడుంటే సిరి అక్కడే. సిరికి ఎప్పుడూ ఓ ఫ్రెండ్‌లాగా తోడుగా ఉన్నా కూడా వారి ప్రవర్తన చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ఇదంతా షణ్నూ గర్ల్‌ఫ్రెండ్ దీప్తికి కూడా నచ్చలేదు. అందుకే బ్రేకప్ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న షణ్నూ వారి బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు.

సిరి తమ బ్రేకప్‌కు కారణం కాదని చెప్పాడు షణ్నూ. తన వల్ల దీప్తి చాలా నెగిటివిటీ ఎదుర్కుంది అన్నాడు. ఎంతమంది ఎంత ట్రోల్ చేసిన దీప్తి తనకు సపోర్ట్ చేసిందని తెలిపాడు. అయితే సిరితో క్లోజ్‌గా ఉండడం దీప్తికి మాత్రమే కాదు.. వారి కుటుంబానికి కూడా అస్సలు నచ్చలేదట. దీంతో దీప్తి కుటుంబం నుండి తనకు ఒత్తిడి పెరిగిందని అన్నాడు షణ్నూ. అందుకే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. దీని తర్వాత వాళ్లు మళ్లీ కలుస్తారో లేదో అన్నది దేవుడి నిర్ణయం అని అన్నాడు షణ్నూ.

Tags

Read MoreRead Less
Next Story