shree Rapaka : ప్రభాస్ పెళ్లి అయ్యాకే నా పెళ్లి : శ్రీరాపాక

shree Rapaka :  ప్రభాస్ పెళ్లి అయ్యాకే నా పెళ్లి : శ్రీరాపాక
shree Rapaka : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఇందులో అమ్మాయిల ఫాలోయింగ్ అయితే మరీను..

shree Rapaka : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఇందులో అమ్మాయిల ఫాలోయింగ్ అయితే మరీను.. ప్రభాస్ ఒప్పుకోవాలి కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. ఓ నటీ అయితే ప్రభాస్ పెళ్లి అయితే కానీ తాను పెళ్లి చేసుకోను అని చెబుతుంది.. ఆమెనే శ్రీరాపాక.

నటీ కాకముందు పలు సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసిన శ్రీరాపాక.. అర్జీవీ నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్‌‌గా మారింది. ఇక ఇటీవల బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌‌లో సందడి చేసిన ఈమె .. షో నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీబిజీ అయిపోతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ... ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టమని, తాను ఇంటర్ చదువుతున్న టైమ్ నుంచే ప్రభాస్ అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది.

ప్రభాస్ ఫోటో చూసే నిద్ర లేచేదానిని అని, ఈశ్వర్ సినిమా అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అంటుంది. ప్రభాస్‌‌ని కలిసే అవకాశం ఓ సారి వచ్చిందని వెల్లడించింది. ఇక ప్రభాస్ పెళ్లి అయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని, లేకపోతే లేదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story