Singer Sunitha Son : హీరోగా సింగర్ సునీత కొడుకు..ప్రొడ్యూసర్ ఎవరంటే?

Singer Sunitha Son : హీరోగా సింగర్ సునీత కొడుకు..ప్రొడ్యూసర్ ఎవరంటే?
Singer Sunitha Son : సింగర్ సునీత .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్‌‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Singer Sunitha Son : సింగర్ సునీత .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్‌‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాలుగుపదుల వయసులో కూడా ఇంకా తరిగిపోని అందంతో ఆకట్టుకుంటుంది. ఇదిలావుండగా ఆమె కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడని ఫిలింనగర్‌‌లో టాక్ నడుస్తోంది. సునీత భర్త, మ్యాంగ్‌ మీడియా అధినేత రామ్‌ వీరపనేనిని ఈ సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం.

ఇక సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్‌గా బుల్లితెరకు పరిచమైంది. ఇప్పుడు సునీత కొడుకు హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. కాగా 19 ఏళ్ల వయసులో కిరణ్ అనే వ్యక్తిని సునీత ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.. ఈ జంటకి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా 2020లో రామ్‌ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story