Arabic Kuthu: 'బీస్ట్' కోసం మరోసారి లిరిసిస్ట్‌గా మారిన హీరో.. తన రెమ్యునరేషన్‌‌తో..

Arabic Kuthu: బీస్ట్ కోసం మరోసారి లిరిసిస్ట్‌గా మారిన హీరో.. తన రెమ్యునరేషన్‌‌తో..
Arabic Kuthu: శివకార్తికేయన్‌కు, కోలీవుడ్ హీరోలు అందరికీ మంచి సాన్నిహిత్యం ఉంది.

Arabic Kuthu: మామూలుగా ఒక సినిమా నుండి ఏదైనా వీడియో సాంగ్ రిలీజ్ అయితే దానికి మిలియన్ వ్యూస్ రావడానికి కనీసం ఒకరోజు పడుతుంది. కానీ ఇప్పట్లో స్టార్ హీరోలకు మాత్రం అది కేవలం గంటల్లో పని అయిపోయింది. ఇటీవల మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' నుండి విడుదలయిన 'కళావతి' పాట గంటల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అయితే విజయ్ నటిస్తున్న 'బీస్ట్' చిత్రం నుండి విడుదలయిన పాట మాత్రం ఏకంగా మిలియన్‌కు పైగా వ్యూస్‌ను తెచ్చిపెట్టింది.

విజయ్ పాన్ ఇండియా చిత్రం 'బీస్ట్'లో నుండి 'అరబిక్ కుతు' అనే పాటను విడుదల చేయడానికి దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, పాట రాసిన శివకార్తికేయన్ కలిసి ఓ ప్రమోషనల్ వీడియో చేశారు. ఆ ప్రమోషనల్ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాటకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్. అయితే ఈ వీడియో విడుదలయిన కాసేపట్లోనే మిలియన్నర వ్యూస్‌ను సాధించింది.

శివకార్తికేయన్‌కు, కోలీవుడ్ హీరోలు అందరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే హీరోగా పాపులర్ అవ్వడానికి ముందే శివకార్తికేయన్ అందరికీ హోస్ట్‌గా పరిచయం. హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శివకార్తికేయన్.. పలు సినిమాలకు లిరిసిస్ట్‌గా కూడా పనిచేశాడు. అందుకే తన టాలెంట్‌కు మెచ్చిన విజయ్.. ఏరికోరి తన బీస్ట్ సినిమాలో పాట రాయడానికి శివకార్తికేయన్‌ను మళ్లీ లిరిసిస్ట్‌ను చేశాడు.

శివకార్తికేయన్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆన్ స్క్రీన్ కూడా హీరోనే. తాను ఎప్పుడూ ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు. అయితే బీస్ట్‌లో అరబిక్ కుతు పాట రాసినందుకు తనకు వచ్చిన రెమ్యునరేషన్‌ను మరణించిన లిరిసిస్ట్ ముత్తుకుమార్ కుటుంబానికి అందజేశాడు. బీస్ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుండగా అరబిక్ టచ్‌తో వచ్చిన అరబిక్ కుతు పాట కొన్నాళ్లు సోషల్ మీడియాను ఏలేయడం ఖాయం అనుకుంటున్నారు విజయ్ అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story