Sudeep: 'డబ్ చేస్తే పాన్ ఇండియా సినిమాలు కావు': సుదీప్

Sudeep: డబ్ చేస్తే పాన్ ఇండియా సినిమాలు కావు: సుదీప్
Sudeep: ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారని, అందులో చిన్న కరెక్షన్‌ ఉందని సుదీప్ అన్నాడు.

Sudeep:ప్రస్తుతం సౌత్ సినిమాలే ఇండియన్ ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలయ్యి అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తూ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. అయితే బాలీవుడ్ మాత్రం వారి సినిమాలను మినిమమ్ హిట్ అనిపించుకోవడానికి కష్టపడుతున్నాయి. దీంతో బాలీవుడ్‌పై కామెంట్స్ ఎక్కువయ్యాయి. తాజాగా కన్నడ హీరో సుదీప్ కూడా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఒకవైపు కన్నడలో స్టార్ హీరోగా వెలిగిపోతూనే తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ'లో విలన్‌గా నటించాడు సుదీప్. ఈ సినిమాతో తను తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. దాని తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు చేసిన సుదీప్.. ప్రస్తుతం శాండిల్‌వుడ్‌లోనే హీరోగా బిజీ అయ్యాడు. ఇక త్వరలోనే 'విక్రాంత్ రోణ' అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో సుదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారని, అందులో చిన్న కరెక్షన్‌ ఉందని సుదీప్ అన్నాడు. ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ హాట్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ వాళ్లు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారని తెలిపాడు. హిందీలో తీసిన సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి పాన్ ఇండియా సినిమాలు అంటున్నారని వివరించారు.

సౌత్ వారు తీసే సినిమాలు అన్ని చోట్లకి రీచ్ అయి, అన్ని చోట్ల విజయం సాధించేలా ఉంటున్నాయని ప్రశంసించారు. ప్రస్తుతం సౌత్ సినిమాలను ప్రపంచమంతా చూస్తోందని అన్నాడు సుదీప్. దీంతో బాలీవుడ్ వారిపై కామెంట్స్ చేసిన నటీనటుల లిస్ట్‌లోకి సుదీప్ పేరు కూడా చేరిపోయింది. ప్రస్తుతం సుదీప్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story