Tahira Kashyap: శృంగారం గురించి హీరో భార్య బోల్డ్ కామెంట్స్.. భర్తతో అలా అంటూ ఓపెన్‌గా..

Tahira Kashyap: శృంగారం గురించి హీరో భార్య బోల్డ్ కామెంట్స్.. భర్తతో అలా అంటూ ఓపెన్‌గా..
Tahira Kashyap: శిల్పా శెట్టి హోస్ట్‌గా వ్యవహరించే ‘షేప్ ఆఫ్ యు’ అనే కార్యక్రమంలో పాల్గొంది తాహిరా.

Tahira Kashyap: సినీ పరిశ్రమలో ఉండేవారు చాలావరకు బోల్డ్‌గా ఉంటారని, బోల్డ్‌గా మాట్లాడతారని చాలామందిలో ఒక ఒపినియన్ ఉంది. అది నిజమే అనిపించేలా ఇప్పటివరకు ఎంతోమంది కొన్ని విషయాల గురించి బోల్డ్‌గా పబ్లిక్‌లో మాట్లాడారు కూడా. అయితే తాజాగా ఓ హీరో భార్య తమ శృంగార జీవితం గురించి ఎదురైన ప్రశ్నకు ఓపెన్‌గా సమాధానాలు ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఆయుష్మాన్ ఖుర్రానా.. ఈ హీరోకు బాలీవుడ్‌లోనే కాదు.. ఇతర ఇండస్ట్రీల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హీరో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇతరుల విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే మనస్థత్వం. అంతే కాకుండా ఆయుష్మాన్.. ఒక ఫ్యామిలీ మ్యాన్. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఆయుష్మా్న్ భార్య తాహిరా కశ్యప్ చేసిన బోల్డ్ కమెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


శిల్పా శెట్టి హోస్ట్‌గా వ్యవహరించే 'షేప్ ఆఫ్ యు' అనే కార్యక్రమంలో పాల్గొంది తాహిరా. అందులో తన సెక్స్ లైఫ్ గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది. అయితే దానికి సమాధానంగా తాహిరా.. శృంగారానికి మించిన వ్యాయామం ఉండదూ అంటూ ఓపెన్‌గా మాట్లాడింది. అంతే కాకుండా దాని వల్ల ఎన్నో క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story