Beast Trailer : బీస్ట్ ట్రైలర్ చూశారా.. మైండ్ బ్లోయింగ్ అంతే..!

Beast Trailer : బీస్ట్ ట్రైలర్ చూశారా.. మైండ్ బ్లోయింగ్ అంతే..!
Beast Trailer : తమిళ స్టార్ హీరో తలపతి విజయ్‌ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘బీస్ట్’.. భారీ అంచనాల నడుమ ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Beast Trailer : తమిళ స్టార్ హీరో తలపతి విజయ్‌ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'బీస్ట్'.. భారీ అంచనాల నడుమ ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది... ఉగాది పండగ సందర్భంగా సినిమాకి సంబంధించిన తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.. యాక్షన్‌ హంగామాతో ఆద్యంతం ఆకట్టుకుంది ట్రైలర్.. ట్రైలర్‌ చూస్తుంటే పూర్తి మాస్‌ యాక్షన్‌ సినిమాగా 'బీస్ట్‌'ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

ఇందులో విజయ్‌ ఇండియన్‌ స్పై వీర రాఘవన్‌ అనే ఏజెంట్‌గా కనిపిస్తుండగా అతనికి జోడీగా పూజా హెగ్డే నటించింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించాడు. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఏప్రిల్‌ 13 రోజునే కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కేజీయఫ్‌2' కూడా రిలీజ్ అవుతుంది.. చూస్తుంటే ఈ రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. చూడాలి మరి.



Tags

Read MoreRead Less
Next Story