Sarkaru Vaari Paata : 'సర్కారు వారి పాట'లో టాలీవుడ్ యంగ్ హీరో కొడుకు...!

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాటలో టాలీవుడ్  యంగ్ హీరో కొడుకు...!
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ సర్కారు వారి పాట..

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ సర్కారు వారి పాట.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ ఈ సినిమాని మే 12న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్ గా టాలీవుడ్ యంగ్ హీరో కొడుకు నటించనున్నాడట.. సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఈ సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నాడట.. ఈ విషయాన్ని సుధీర్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శన్ ఇప్పటికే 2018లో అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారిలో సినిమాలో నటించాడు.

ఇక సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ కూడా మోసగాళ్లకు మోసగాడు, విన్నర్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story