Chiranjeevi: ఆచార్య సెట్‌లోకి అనుకోని అతిధి.. వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi: ఆచార్య సెట్‌లోకి అనుకోని అతిధి.. వీడియో షేర్ చేసిన చిరంజీవి
Chiranjeevi: హనుమంతుడికి రామయ్య తండ్రి అంటే వల్లమాలిన అభిమానం.. రాముడి కోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ ఆంజనేయుడిది.

Chiranjeevi: హనుమంతుడికి రామయ్య తండ్రి అంటే వల్లమాలిన అభిమానం.. రాముడి కోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ ఆంజనేయుడిది. మెగాస్టార్ చిరంజీవి హనుమంతుని భక్తుడు.. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ జరుపుకుంటోంది.. దేవాలయాలు, వాటిలో జరుగుతున్న అవనీతి కథాంశంతో ఆచార్య చిత్రం తెరకెక్కుతోంది. శనివారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆచార్య సెట్ లో చోటు చేసుకున్న ఓ అపురూప దృశ్యాన్ని ఆయన వీడియోలో బంధించారు..

ఆ క్లిప్పింగ్ ని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగు రాష్టాల్లోని అటవీ ప్రాంతంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ మేకప్ వేసుకుంటున్న సమయంలో ఓ వానరం అక్కడికి వచ్చింది. దాన్ని గమనించిన చరణ్ తన వద్ద ఉన్న బిస్కెట్స్ అందించారు. వానరం వాటిని తింటూ అక్కడే కూర్చుంది. ఈ వీడియోని షేర్ చేసిన చిరు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story