సినిమా

Vamsi Paidipally : విజయ్‌తో వంశీ పైడిపల్లి మూవీ..!

మహర్షి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు వంశీ పైడిపల్లి తదుపరి చిత్రం దాదాపుగా ఖరారైంది.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నారు.

Vamsi Paidipally :  విజయ్‌తో వంశీ పైడిపల్లి మూవీ..!
X

మహర్షి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు వంశీ పైడిపల్లి తదుపరి చిత్రం దాదాపుగా ఖరారైంది.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇది విజయ్ 66 వ చిత్రంగా తెరకెక్కుతోంది. 65 వ చిత్రాన్ని నెల్సన్ దీలిప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ సినిమా అయిపోగానే వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో పాల్గొంటారు విజయ్. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. అటు తెలుగులో కూడా విజయ్ కి మంచి మార్కెట్ ఉంది. ఇటీవల విడుదలైన ఆయన చిత్రాలు ఇక్కడ మంచి విజయాన్ని అందుకున్నాయి. కాగా కార్తీ హీరోగా నటించిన తొలి తెలుగు సినిమా ఊపిరి కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఈ సినిమా కార్తీకి మంచి పేరును తీసుకువచ్చింది.

Next Story

RELATED STORIES