Vijay Devarakonda: నాని వదులుకున్న కథతో విజయ్ దేవరకొండ సినిమా..

Vijay Devarakonda: నాని వదులుకున్న కథతో విజయ్ దేవరకొండ సినిమా..
Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Vijay Devarakonda: సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం రాసుకున్న కథలు చాలా సందర్భాలు మరొకరి చేతికి వెళ్తుంటాయి. ఇది చాలా కామన్‌గా జరిగే విషయమే. అలాగే తాజాగా నేచురల్ స్టార్ నాని చేయాల్సిన ఒక కథ విజయ్ దేవరకొండ చేతికి వెళ్లిందంటూ టాక్ వినిపిస్తోంది. నాని, విజయ్ దేవరకొండ ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉండగా.. తాజాగా నాని వద్దనుకున్న కథ ఒకటి విజయ్ చేతికి వెళ్లిందట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్‌లో ఉన్న విజయ్.. అది పూర్తవ్వకముందే పూరీతో 'జనగణమన' చేయడానికి సిద్ధమయిపోయాడు. ఇక వీటి తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఇటీవల ప్రారంభించాడు.

అయితే శివ నిర్వాణతో విజయ్ చేస్తున్న సినిమా కథను దర్శకుడు ముందుగా నానికి వినిపించాడట. కానీ నాని ఎందుకో ఆ కథను రిజెక్ట్ చేశాడట. అయితే ఇప్పటికే శివ నిర్వాణ, నాని కాంబినేషన్‌లో 'టక్ జగదీష్' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాగా అది అంతగా పాజిటివ్ టాక్‌ను సంపాదించలేకపోయింది. ఇక మరోసారి అలాంటి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనే విజయ్ దేవరకొండను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనున్నాడు శివ నిర్వాణ.

Tags

Read MoreRead Less
Next Story