Kushi : విజయ్, సమంతల 'ఖుషి' ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది...!

Kushi : విజయ్, సమంతల ఖుషి ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది...!
Kushi : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..

Kushi : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాకి ఖుషి టైటిల్ ని ఫిక్స్ చేశారు.. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్‌ ఫుల్‌ స్టైలిష్‌ లుక్‌లో.. సామ్‌ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని 2022 డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రం. ప్రస్తుతం కాశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

కాగా అటు విజయ్.. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ అనే మూవీని కంప్లీట్ చేశాడు.ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుంది. పూరి డైరెక్షన్ లోనే జనగణమన అనే మరో మూవీని కూడా మొదలుపెట్టేశాడు విజయ్ .


Tags

Read MoreRead Less
Next Story