Beast Movie: నా కొడుకు స్టార్‌డమ్ వల్లే 'బీస్ట్' హిట్ అయ్యింది: విజయ్ తండ్రి హాట్ కామెంట్స్

Beast Movie: నా కొడుకు స్టార్‌డమ్ వల్లే బీస్ట్ హిట్ అయ్యింది: విజయ్ తండ్రి హాట్ కామెంట్స్
Beast Movie: ఓ ఇంటర్వ్యూలో బీస్ట్‌పై, నెల్సన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ తండ్రి చంద్రశేఖర్.

Beast Movie: కోలీవుడ్ నుండి చాలారోజుల తర్వాత విడుదలయిన పాన్ ఇండియా చిత్రమే 'బీస్ట్'. ముందుగా ఈ సినిమా నుండి విడుదలయిన పాటలు బీస్ట్‌పై అంచనాలను పెంచేశాయి. కానీ సినిమా విడుదలయిన మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ 2'లాంటి చిత్రాల మధ్య బీస్ట్ పూర్తిగా కనుమరుగయిపోయింది. దీని కారణంగా విజయ్ తండ్రి చంద్రశేఖర్.. బీస్ట్ దర్శకుడిపై ఫైర్ అయ్యారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే బీస్ట్. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం పెద్ద ప్లస్. అయితే మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలయినా కూడా మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత రోజే కేజీఎఫ్ 2 విడుదల కావడంతో ప్రేక్షకులంతా ఆ సినిమావైపు మొగ్గుచూపారు. ఇక తాజాగా బీస్ట్‌పై విజయ్ తండ్రి స్పందించారు.

బీస్ట్ రిలీజ్ తర్వాత విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బీస్ట్‌పై, నెల్సన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ స్టార్‌డమ్ వల్లే బీస్ట్ ఇంకా నడుస్తుంది అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు చంద్రశేఖర్. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్‌.. ఇలాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌ని సెలక్ట్‌ చేసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేతో ఒక మ్యాజిక్‌ క్రియేట్‌ చేయవచ్చని, 'బీస్ట్‌'లో ఆ మ్యాజిక్‌ ఎక్కడుంది అని ప్రశ్నించారు.


రా ఏజెంట్‌ ఎలా వ్యవహరిస్తాడు అన్న అంశంపై నెల్సన్ ఇంకా వర్క్ చేయాల్సింది అన్నారు. బీస్ట్ హిట్ అని, ఇందులో అందరి పాత్ర ఉందని తెలిపిన చంద్రశేఖర్.. నెల్సన్ పేరును మాత్రం చెప్పకపోవడం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story