Vijay Fans : విజయ్ ఫ్యాన్స్ సర్‌‌ప్రైజ్ : బీస్ట్ మూవీ చూసినందుకు లీటర్ పెట్రోల్ ఫ్రీ..!

Vijay Fans : విజయ్ ఫ్యాన్స్ సర్‌‌ప్రైజ్  :  బీస్ట్ మూవీ చూసినందుకు  లీటర్ పెట్రోల్ ఫ్రీ..!
Vijay Fans : దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో బైక్ బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

Vijay Fans :దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో బైక్ బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడు సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకి ఏకంగా లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించారు.ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ ఘటన చెంగల్పట్టులోని తాంబరం నేషనల్ థియేటర్‌ వద్ద జరిగింది. విజయ్ 65వ చిత్రంగా తెరకెక్కిన బీస్ట్ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో వివి గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారధం పడుతున్నారు.

ఈ నేపధ్యంలో విజయ్ అభిమానులు సినిమా చూసేందుకు వచ్చిన ఓ 100 మంది ద్విచక్ర వాహనదారులకు 1 లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు. రోజురోజుకు ఇంధన ధరలు పెరుగుతుండటంతో తాంబరంలోని విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్రోల్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కాగా విజయ్ అభిమానులు ఇప్పటికే ఈ చిత్రాన్ని వరుసగా 5 రోజులు ప్రీ రికార్డ్ చేయడంతో ఈ చిత్రం కలెక్షన్లలో కొత్త రికార్డును చేరుకుంటుందని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story