RRR: 12 సార్లు చూశా.. ఎప్పుడు చూసినా కొత్తగా..: శ్రీనివాస్ మోహన్

RRR: 12 సార్లు చూశా.. ఎప్పుడు చూసినా కొత్తగా..: శ్రీనివాస్ మోహన్
RRR: ఆర్ఆర్ ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలో విడుదలై ఓ సంచలనం సృష్టిస్తోంది.

RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్. ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలో విడుదలై ఓ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాను ఇప్పటికే తాను 12 సార్లు చూశానని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ అన్నారు. ఆయనే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేశారు.

ఎన్ని సార్లు చూసినా ప్రతి ఫార్మాట్ లో తనలో ఉత్సాహం మరింత రెట్టింపైందని తెలిపారు. ప్రేక్షకుల స్పందన కోసం వెయిట్ చేస్తున్నానని శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఈ మూవీ సాధారణ థియేటర్ ఫార్మాట్ తో పాటు, డాల్బీ విజన్/డాల్ఫీ అట్మాస్, 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డాల్బీ విజన్ లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించనుంది. నిజానికి రాజమౌళికి 3డీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు.. కానీ కొన్ని సన్నివేశాలు ఆ ఫార్మాట్ లో చూసిన తరువాత ఆయన తన ఆలోచన మార్చుకున్నారు.

3డీలో విజువల్స్ అద్భుతంగా ఉండడంతో మొత్తం సినిమాను ఆ ఫార్మాట్ లో తీసుకువచ్చారు. ఇక శ్రీనివాస్ మోహన్ కి ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. ఇంతకు ముందు 2.ఓ, బాహుబలి ది బిగినింగ్, రోబో చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.

Tags

Read MoreRead Less
Next Story