Bangarraju : బంగార్రాజులో చైతూ పక్కన నటించిన ఈ పిల్ల ఎవరు?

Bangarraju : బంగార్రాజులో చైతూ పక్కన నటించిన ఈ పిల్ల ఎవరు?
Bangarraju : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు..

Bangarraju : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై మంచి బాక్సాఫీసు వద్ద మంచి హిట్ కొట్టింది.


అయితే ఈ సినిమాలో హీరో నాగచైతన్య ఇంట్రడక్షన్ సీన్ లో ఓ అమ్మాయితో ఉట్టి కొట్టించడం, ఆ తర్వాత ఆ అమ్మాయి లడ్డుందా సాంగ్ లో మెరిసింది.


ఆ అమ్మాయి పేరు యష్ణచౌదరి.. పక్క హైదరాబాద్ అమ్మాయి.. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత రేడియో మిర్చిలో ఆర్జేగా పనిచేసింది.


ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేసింది.. అయితే ఫస్ట్ మూవీనే స్టార్ హీరో నాగచైతన్యతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది యష్ణచౌదరి.


అయితే ఆ సినిమాలో నాగార్జునతో కలిసి నటించకపోవడం కాస్త డిస్సాపాయింట్ అనిపించిందని పేర్కొంది. కానీ సెట్స్ లో ఆయన చాలా సేపు మాట్లాడారని తెలిపింది.


కాగా బంగార్రాజు చిత్రం నేటినుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story