Yash: కూతురితో సలాం అనిపించుకున్న రాకీ భాయ్.. వీడియో వైరల్..

Yash: కూతురితో సలాం అనిపించుకున్న రాకీ భాయ్.. వీడియో వైరల్..
Yash: అందుకే యశ్ కూతురు సైతం తనను సలాం రాకీ భాయ్ అనే పిలుస్తోంది.

Yash: కన్నడ సినీ పరిశ్రమలో ఎప్పటినుండో హీరోగా వ్యవహరిస్తున్నా.. 'కేజీఎఫ్' లాంటి ఒక్క చిత్రంతో సూపర్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో ప్రస్తుతం కేవలం శాండిల్‌వుడ్ మాత్రమే కాదు.. పూర్తిగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీ చూపు కూడా యశ్‌పైనే ఉంది. యశ్ కంటే ఎక్కువగా రాకీ భాయ్‌గానే ఈ హీరో అందరికీ గుర్తుండిపోతాడు. అందుకే యశ్ కూతురు సైతం తనను సలాం రాకీ భాయ్ అనే పిలుస్తోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ చూపునే తనవైపు తిప్పుకుంది. ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాప్టర్ 2.. చాప్టర్ 1 కంటే పెద్ద హిట్ అయ్యింది. కలెక్షన్ల విషయంలో కూడా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది కేజీఎఫ్ చాప్టర్ 2. అయితే ఇప్పటికే చాప్టర్ 1లోనే సలాం రాకీ భాయ్ పాట వింటే ఓ కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా అనిపిస్తుంది యశ్ అభిమానులకు. ఆ పాటను చాలా క్యూట్‌గా పాడింది యశ్ కూతురు.

యశ్.. తన సహ నటి రాధిక పండిట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముందుగా కూతురు ఐరా జన్మించగా.. ఆ తర్వాత కుమారుడు అధర్వ్ పుట్టాడు. ఇటీవల ఐరా.. తన తండ్రి కేజీఎఫ్ సినిమాలోని రాకీ భాయ్ పాటను పాడుతున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంతా వీడియో చాలా క్యూట్ ఉందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story