నగరంలో పెరుగుతున్న పార్కింగ్ కష్టాలు
.jpg)
* సతమతమౌతున్న వాహనదారులు
* చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు
గ్రేటర్‌లో పార్కింగ్ కష్టాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా భవనాలను నిర్మిస్తున్న యజమానులు పార్కింగ్ విషయాన్ని పట్టించుకోవటం లేదు. దీంతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజధానిలో ఇబ్బడి ముబ్బడిగా వాహానాలు పెరిగిపోవడంతో పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. దీంతో రవాణ వ్యవస్ద మరింత అస్తవ్యస్తంగా మారుతోంది. నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహానలు కొత్తగా రోడ్లపైకి వస్తుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది.
ఇక అలా షాపింగ్ కోసమని వెళితే.. వాహనాన్ని ఎక్కడ పార్క్ చేయాలో తెలియని పరిస్థితి. రోడ్లను, సెల్లార్‌లను ఆక్రమించి జరుగుతున్న వ్యాపారాలతో వాహనం నిలిపేందుకు గజం చోటు కూడా దొరకటం లేదు. పార్కింగ్ నిబంధనలు పట్టించుకోకుండా భవనాలు నిర్మిస్తుండటంతో ఈ సమస్య మరింత తీవ్రమౌతోంది. దీనికి తోడు సెల్లార్లలో షాపులు ఉండటంతో వాహానాలన్ని రోడ్డపైనే దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం అక్రమంగా నిర్మిస్తున్న షాపులు.. వారికి పుష్కలంగా అధికారుల అండదండలు ఉండడంతో పార్కింగ్ కష్టాలు మరింత పెరుగుతున్నాయి.
మరోవైపు నిబంధనలకు విరుద్దంగా ఉన్న షాపులపై చర్యలు తీసుకోవటంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నీళ్ళు నములుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలో తెలియక సతమత మవుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Published Date : Friday, 3/2/2012 12:57 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |