Travis Head: పెను ప్రమాదం నుండి తప్పించుకున్న స్టార్ క్రికెటర్.. త్రుటిలో చావు నుండి..

Travis Head: పెను ప్రమాదం నుండి తప్పించుకున్న స్టార్ క్రికెటర్.. త్రుటిలో చావు నుండి..
Travis Head: ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్ ట్రావిస్ హెడ్, భార్య జెస్సికా డేవిస్‌తో కలిసి విమానంలో మాల్దీవ్స్‌కు వెళ్లారు.

Travis Head: విమాన ప్రమాదాలు అనేవి తరచుగా జరగకపోయినా.. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ప్రయాణికులు బ్రతికే అవకాశం చాలా తక్కువ. అయితే తాజాగా ఓ స్టార్ క్రికెటర్ ప్రయాణిస్తున్న విమానం కూడా ఇలాగే ప్రమాదానికి గురయ్యింది. కానీ అతడు, తన భార్య త్రుటిలో దీని నుండి తప్పించుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో ఆ క్రికెటర్ భార్య తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్, భార్య జెస్సికా డేవిస్‌తో కలిసి విమానంలో మాల్దీవ్స్‌కు వెళ్లారు. అక్కడ కొన్నిరోజులు హాలిడేస్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్లైట్‌లోని సాంకేతిక సమస్య వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే మంచిది అనుకున్నాడు పైలెట్. కానీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ట్రావిస్ భార్య జెస్సికా ఆరు నెలల గర్భవతి. దీంతో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న తర్వాత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

'హాలిడే వెకేషన్‌ను సరదాగా గడిపాం. ఆస్ట్రేలియాకు తిరిగి రావడానికి మాల్దీవ్స్‌లో ఫ్లయిట్ ఎక్కాం. గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తైన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుని దయవల్ల మాకు ఏం కాలేదు. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోతానేమోనని అనిపించింది. ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెస్క్యూ ప్లేన్‌ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్‌ రాజధాని మాలీలో మాకు వసతి ఏర్పాటు చేసి మరో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.' అని తెలిపింది జెస్సికా



Tags

Read MoreRead Less
Next Story