T20 World Cup: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు అచ్చి రాలేదు.. టీమిండియాకు ఇది మూడోసారి..

T20 World Cup (tv5news.in)

T20 World Cup (tv5news.in)

T20 World Cup: ఎంతమంది ఎంత కాదన్నా.. క్రికెట్ అనేది ఒక ఆట కాదు.. ఒక ఎమోషన్.

T20 World Cup: ఎంతమంది ఎంత కాదన్నా.. క్రికెట్ అనేది ఒక ఆట కాదు.. ఒక ఎమోషన్. అందుకే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఓటమి పాలయ్యి ఇంటి బాటపట్టింది అనగానే క్రికెట్ లవర్స్ అంతా నిరాశకు గురయ్యారు. మొదటి నుండే ఫ్యాన్స్‌‌ను నిరాశపరుస్తూ వచ్చిన టీమిండియా ఓడిపోయే సమయం వచ్చినప్పుడు తిరిగి పోరాడడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది.

ఇండియా సెమీస్‌కు వెళ్తుందా లేదా అన్న నిర్ణయం నిన్న జరిగిన ఆఫ్గనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. ఆఫ్గనిస్తాన్ గెలిస్తే ఆ టీమ్‌తో పాయింట్స్ టేబుల్‌లో చివరగా ఉన్న టీమిండియాకు కూడా సెమీస్‌కు వెళ్లే అవకాశం లభించేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్‌ను ఎదుర్కోలేక ఆఫ్గనిస్తాన్ వెనుదిరిగింది. దీంతో ఈ రెండు టీమ్‌లు ఇక ఇంటికే.

ఈ ఓటమితో ఇంతకు ముందు జరిగిన పలు క్రికెట్ మ్యాచ్‌లను కూడా టీమిండియా ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. న్యూజిలాండ్‌తో టీమిండియాకు ఉన్న వైరం ఇప్పటిది కాదు. న్యూజిలాండ్‌కు ఇండియా ఎప్పుడు ఎదురెళ్లినా.. ఎక్కువశాతం ఓటమినే చవిచూడాల్సి వచ్చింది. ఈసారి జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇలా జరగడం మూడోసారి.

2019 వరల్డ్ కప్ సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఉంది. అదే ధోనీ రన్ అవుట్. అందరికీ ఇష్టమైన కెప్టెన్ కూల్ ధోనీ అప్పటికే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించినా.. 2019 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మ్‌కు దూరమవుతానని స్పష్టం చేశాడు. అయితే ధోనీ చివరి మ్యాచ్‌పై ఎన్నో ఆశల పెట్టుకున్నారు అభిమానులు. కానీ న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో ధోనీ రన్ అవుట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా టీమిండియా ఫ్యాన్స్ మనసు ముక్కలైంది.

ఆ ఏడాది జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ దాదాపు టీమిండియాకే ఖాయమనుకున్నారు అందరు. కానీ అన్ని అడ్డంకులు దాటుకుంటూ వచ్చిన ఇండియన్ టీమ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి మరోసారి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక మూడోసారిగా టీ20 వరల్డ్ కప్ అవకాశం కూడా న్యూజిలాండ్ వల్లే చేజారిపోయింది. దీంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు మనకు కలిసి రాలేదంటూ టీమిండియా ఫ్యాన్స్ నెట్టింట్లో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story