IPL 2022 : నేటి నుంచి ఐపీఎల్ 2022 .. ఫస్ట్ మ్యాచ్... చెన్నై vs కోల్‌కత్తా

IPL 2022 :  నేటి నుంచి ఐపీఎల్ 2022 .. ఫస్ట్ మ్యాచ్... చెన్నై vs కోల్‌కత్తా
IPL 2022 : ఇప్పుడు జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా జట్టును ఎలా నడిపిస్తాడన్నదానిపైనే అందరి దృష్టి ఉంది.

IPL 2022: మెగా టోర్నీ ఐపీఎల్‌కు సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది రన్నరప్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించే గేమ్‌మతో ఐపీఎల్ ప్రారంభం కానుంది. చెన్నై జట్టుకు నాలుగుసార్లు ట్రోఫీ అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. టోర్నీ ప్రారంభానికి సరిగ్గా రెండు రోజుల ముందు కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడం అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా జట్టును ఎలా నడిపిస్తాడన్నదానిపైనే అందరి దృష్టి ఉంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఈసారి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. ఈసారి శ్రేయాస్ అయ్యర్ ఆ జట్టును నడిపించనున్నాడు. శ్రేయాస్ గతంలో ఢిల్లీ కేపిటల్స్‌ను లీడ్ చేశాడు. రవీంద్ర జడేజాకు మాత్రం జట్టును నడిపించడం ఇదే తొలిసారి. అయితే, సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ధోనీ జట్టులోనే ఉంటాడు కాబట్టి జడేజాకు అతడి మద్దతు పుష్కలంగా ఉంటుంది.

ఫిట్‌నెస్ సమస్య నేపథ్యంలో దీపక్ చాహర్ సేవలను చెన్నై మిస్సవుతుండగా, కేకేఆర్‌ కూడా ఆసీస్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, అరోన్ ఫించ్‌లను మిస్సవుతోంది. ఐపీఎల్‌లో ఆడేందుకు వీరిద్దరికీ ఎన్ఐసీ లభించినప్పటికీ ఏప్రిల్ 6 తర్వాత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

దీంతో చేజింగ్ జట్టుకు అనుకూలంగా ఉండేం అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. సీఎస్‌కే 17సార్లు విజయం సాధించగా, కేకేఆర్ 8సార్లు గెలిచింది.

Tags

Read MoreRead Less
Next Story