Sonu Sood: ఇండియా గెలిచింది: వైరల్ అవుతున్న సోనూ సూద్ పోస్ట్

Sonu Sood (tv5news.in)

Sonu Sood (tv5news.in)

Sonu Sood: ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే కేజీల కొద్దీ అటెన్షన్, టన్నుల కొద్దీ టెన్షన్..

Sonu Sood: ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే కేజీల కొద్దీ అటెన్షన్, టన్నుల కొద్దీ టెన్షన్.. బిగుసుకుపోయే కండరాలు, ఎగిసిపడే శ్వాస.. కళ్లల్లో కసి, మాటల్లో వాడి వేడి.. ఈ ఫీలింగ్స్ లేకుండా ఏ క్రికెట్ లవర్ కూడా స్టేడియంకు వెళ్లలేడు, మ్యాచ్ చూడలేడు.. టీవీ ముందు కూర్చోలేడు, రిమోట్ ఆన్ చేయలేడు.. లేటెస్ట్ ఇండియా, పాక్ మ్యాచ్‌కు కూడా ఆడియన్స్‌లో ఇవే ఫీలింగ్స్. కానీ ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోవడంతో ఈ ఫీలింగ్స్ అన్నీ ఫిఫ్త్ గేర్‌లో పరిగెత్తాయి. టాప్ గేర్‌లో బయటపడ్డాయి. కానీ సోనూ సూద్ మాత్రం ఇండియా గెలిచిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నిన్నటి ఇండియా వెర్సస్ పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి సినీ సెలబ్రిటీలు సైతం సిద్ధమయ్యారు. కొందరు అయితే దానికోసం నేరుగా దుబాయ్‌కే ప్రయాణమయ్యారు. కొందరు తమ టీవీలకు అతుక్కుపోయారు. ఇదంతా క్రికెట్ లవర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ టాస్ వేసినప్పటి నుండి అందరి అంచనాలు తారుమారు అవుతూ వచ్చాయి.

ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతోనే మ్యాచ్‌లో మొదటి ట్విస్ట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శర్మ డక్ ఔట్ మ్యాచ్‌పై ఆటలను నీరుగారేలా చేసింది. విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన తర్వాత అతడు చేసిన హాఫ్ సెంచరీ మ్యాచ్‌లో కీలకంగా మారింది. అలా పాకిస్థాన్‌కు 20 ఓవర్లలో 152 టార్గెట్ ఇచ్చింది ఇండియా. ఆ టార్గెట్‌ను చేధించే ప్రయత్నంలో పాక్ కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అలా పాకిస్థాన్ ఘన విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ అయిపోయిన తర్వాత పాక్ క్రికెటర్లు చాలామంది టీమిండియా దగ్గరకు వచ్చి వారితో మాటలు కలిపారు. అక్కడి యంగ్ క్రికెటర్లు.. ఇక్కడి సీనియర్ క్రికెటర్లతో ముచ్చటించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. రిజ్వాన్, బాబర్ ఆమన్‌తో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోను సోనూ సూద్ పోస్ట్ చేసి ఇండియా గెలిచింది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది చూసి నెటిజన్లు సోనూ స్పోర్టివ్ స్పిరిట్‌ను మెచ్చుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story