Bengaluru: కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీకి శంకుస్థాపన.. ఇప్పుడు బెంగళూరులో..

Bengaluru: కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీకి శంకుస్థాపన.. ఇప్పుడు బెంగళూరులో..
Bengaluru: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్‌ అకాడమీకి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శంకుస్థాపన చేశారు.

Bengaluru: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్‌ అకాడమీకి బీసీసీఐ సెక్రెటరీ జై షాతో కలిసి.. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాదికల్లా ఈ స్టేడియం అందుబాటులోకి రానుంది. 99 ఏళ్ల పాటు భూమిని లీజుకు తీసుకుని ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దేశవాళీ మ్యాచులు నిర్వహించేందుకు అనువుగా మూడు మైదానాలను తయారు చేస్తారు.

ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, ట్రెజజర్‌ అరుణ్ ధూమల్‌, జాయింట్ సెక్రెటరీ జయేశ్‌ జార్జ్‌, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీని నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకుగాను బీసీసీఐ.. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ కు అద్దె చెల్లిస్తోంది. ఇందులో అవుట్‌డోర్‌ స్టేడియం, ఇండోర్ స్టేడియంతో పాటు జిమ్‌ వంటి సదుపాయాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story