Virat Kohli: ఆటలో విరాట్ ఓటమి.. కూతురు వామికకు బెదిరింపులు..

Virat Kohli (tv5news.in)

Virat Kohli (tv5news.in)

Virat Kohli: ఇప్పుడున్న రోజుల్లో మనుషులు సెన్సిటివ్‌గా ఆలోచించడం మానేశారు.

Virat Kohli: ఇప్పుడున్న రోజుల్లో మనుషులు సెన్సిటివ్‌గా ఆలోచించడం మానేశారు. కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్న దారుణాలే దీనికి ఉదాహరణ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేదాన్ని అడ్డుపెట్టుకుని అవతల వారిని తక్కువ చేసి మాట్లాడడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారిని అనవసరంగా విమర్శించడం హక్కులాగా ఫీల్ అయిపోతున్నారు కొందరు. తాజాగా విరాట్ కోహ్లీకి వస్తున్న వార్నింగ్‌లు చూస్తే మీరూ అలాగే అంటారు..

క్రికెట్ అనేది ప్రజలకు.. ముఖ్యంగా ఇండియన్స్‌కు ఎంత దగ్గరైన ఆట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. వెంటనే టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోయే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఆ ఆటలో టీమిండియా గెలిచినా.. ఓడిపోయినా.. అది ప్రతీ ఒక్క క్రికెట్ లవర్‌పై ప్రభావం చూపిస్తుంది. ఒక ఆటను, అందులో ఆడే ప్లేయర్‌ను ఇష్టపడడం వరకు అభిమానం మంచిదే. కానీ కొన్నిసార్లు అది శృతిమింది మనిషిలోని విచక్షణను కోల్పేయేలా చేస్తుంది.

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పర్ఫెర్మెన్స్ అంత పాజిటివ్‌గా లేదు. మొదటిసారి ఇంటర్నేషన్ వేదికపై పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు చేరుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది. అందుకే టీమిండియా పర్ఫార్మెన్స్ చూసిన ప్రతీ ఒక్కరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా పాజిటివ్‌గానే ఉన్నారు. ఎలాగైనా సెమీస్‌కు చేరుకునే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఆయన అంత పాజిటివ్‌గా ఉండడం ఒక క్రికెట్ లవర్‌కు నచ్చలేదు.

'షేమ్ ఆన్ అనుష్క శర్మ. వామిక ఫోటోలు రివీల్ అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు తనని రేప్ చేయొచ్చు' అంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఒక గేమ్‌ను గేమ్‌లాగా చూడలేని ఈ వ్యక్తి చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఆడుతుంది విరాట్ అయితే ఇందులోకి తన ఫ్యామిలీని తీసుకురావడం ఎందుకని విమర్శిస్తున్నారు. గతంలో ఇలాగే ధోనీ కూతురికి కూడా బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే దీనిని పిచ్చి అనాలో లేక మూర్ఖత్వం అనాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.



Tags

Read MoreRead Less
Next Story