Virat Kohli: కోహ్లీ ఫోన్ స్విచ్ఛాఫ్.. కోచ్ రాజ్‌కుమార్ హాట్ కామెంట్స్..

Virat Kohli: కోహ్లీ ఫోన్ స్విచ్ఛాఫ్.. కోచ్ రాజ్‌కుమార్ హాట్ కామెంట్స్..
Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ గురించి క్రికెట్ ప్రపంచంలో మొదలయిన చర్చ రోజురోజుకీ పెద్ద కాంట్రవర్సీకే దారితీస్తోంది.

Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ గురించి క్రికెట్ ప్రపంచంలో మొదలయిన చర్చ రోజురోజుకీ పెద్ద కాంట్రవర్సీకే దారితీస్తోంది. విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా నియమించడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీసీసీఐ దీనిపై స్పందించింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ విషయంపై ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ గంగూలీ చెప్పిన మాటల్లో నిజం లేదన్నట్టుగా హాట్ కామెంట్స్ చేశారు విరాట్ కోచ్ రాజ్‌కుమార్ శర్మ.

కెప్టెన్‌గా విరాట్‌ టీ20 నుండి తప్పుకోవాలి అనుకున్నప్పుడు బీసీసీఐ నిరాకరించిందని గంగూలీ తెలిపారు. అంతే కాక తాను కెప్టెన్సీ నుండి తప్పుకోకుండా తనను ఒప్పించే ప్రయత్నం చేసినా విరాట్ వినలేదని ఆయన అన్నారు. అయితే ఇదంతా జరగలేదంటూ కామెంట్ చేశారు కోచ్ రాజ్‌కుమార్. కోహ్లీకి గంగూలీ ఏం చెప్పలేదని అన్నారు.

టెస్ట్ కెప్టెన్సీ విషయం తెలిసినప్పటి నుండి కోచ్ రాజ్‌కుమార్.. కోహ్లీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని కానీ తన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని అన్నారు. కోహ్లీని టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పించడానికి కారణాలు సెలక్షన్ కమిటీ ఇంకా చెప్పలేదని స్పష్టం చేశారు కోచ్ రాజ్‌కుమార్. అసలు బీసీసీఐ కానీ, సెలక్షన్ కమిటీ కానీ ఏమనుకుంటున్నారో ఎవ్వరికీ క్లారిటీ లేదు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story