Yash Dhull: టీమ్ ఇండియాలో చోటు సంపాదించడమే లక్ష్యం: యశ్‌ధుల్

Yash Dhull: టీమ్ ఇండియాలో చోటు సంపాదించడమే లక్ష్యం: యశ్‌ధుల్
Yash Dhull: యష్ ధుల్ టీమ్ ఇండియా కోసం ఆడటానికి 18 నెలల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు.

Yash Dhull: యష్ ధుల్ టీమ్ ఇండియా కోసం ఆడటానికి 18 నెలల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్ తర్వాత అండర్-19 టైటిల్ గెలుచుకున్న మూడో కెప్టెన్ యశ్ ధుల్. గత రెండు రోజులుగా సరైన నిద్ర లేదు.. ఎక్కే విమానం దిగే విమానం. సీనియర్ జట్టులో చోటు సంపాదించడమే అతడి లక్ష్యం.. అలసట, ఆకలి, నిద్ర ఇవేవీ తన లక్ష్యానికి అడ్డు పడలేదు.. వెస్టిండీస్ నుంచి భారత్‌కు చేరుకున్నాడు.. అక్కడి నుంచి అహ్మదాబాద్‌లో సత్కారం.. అక్కడి నుంచి ఢిల్లీలోని ఇంటికి..

అక్కడి నుంచి మళ్లీ గువాహటిలో ఉన్న రంజీ జట్టుతో చేరేందుకు ఇంకో మూడు విమానాలు. అయినా అలసట లేదు.. కళ్ల ముందు లక్ష్యమే కనిపిస్తుంది.. యశ్‌ధుల్ ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.. టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. ఒకవేళ అనుకున్న సమయానికి అది నెరవేరకపోయినా నేనేమి నిరుత్సాహపడను.. మరింతగా కృషి చేసి లక్ష్యాన్ని చేరుకుంటా.. రాబోయే రోజుల గురించి భయం లేదు.. కోహ్లీ భాయ్ తన అనుభవాలు నాకు చెప్పారు. ఏ విషయాలపై దృష్టి పెట్టాలి.. వేటిని పక్కన పెట్టాలి అన్న దానిపై ఆయన నాకు ఒక స్పష్టతను కల్పించారు.

శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంబలిన. నా అన్ని షాట్లపై దృష్టిపెట్టి ఉత్తమ ఆటగాడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తానని అంటున్నాడు. BCCI ఇచ్చిన రూ. 40 లక్షల నగదు బహుమతితో ఏమి చేయాలని ప్లాన్ చేస్తున్నారో ఆలోచించడానికి ధూల్‌కి, అతడి తల్లిదండ్రులకు సమయం లేదు. "దేవుని దయతో, మేము సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతాము. యష్‌కి అతడి స్వంత బ్యాక్ ఖాతా ఉంది. ఆటలో గెలిచిన డబ్బు అతడి ఖాతాలోకి వెళ్తుంది. వాటితో ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తాము. కాని దాని కంటే ముందు మా అబ్బాయితో కొంత సమయాన్ని గడపాలనుకుంటున్నాము అని అన్నారు యశ్ ధుల్ తల్లిదండ్రులు.. ఆట కోసమని రోజుల తరబడి ఇల్లు వదిలి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు.. కనీసం ఇంటికి వచ్చినప్పుడైనా అన్నీ మర్చిపోయి అమ్మానాన్నకి తగిన సమయం కేటాయించాలని తల్లిదండ్రులతో పాటు అతడూ కోరుకుంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story