Goa: విదేశీ బాలికను అత్యాచారం చేసిన యువకుడు అరెస్ట్..

Goa: విదేశీ బాలికను అత్యాచారం చేసిన యువకుడు అరెస్ట్..
Goa: రష్యా నుండి ఇండియాకు వచ్చిన తల్లీకూతుళ్లు నార్త్ గోవాలోని ఓ హోటల్‌లో బస చేశారు.

Goa: రోజురోజుకీ దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా గోవాలో ఓ 12 ఏళ్ల రష్యా బాలికను హోటల్‌లో పనిచేసే యువకుడు అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన జరిగి చాలారోజులు అయినా ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది.

రష్యా నుండి ఇండియాకు వచ్చిన తల్లీకూతుళ్లు నార్త్ గోవాలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఏప్రిల్ 6న తన కూతురును స్విమ్మింగ్ పూల్ దగ్గర వదిలేసి నిత్యావసరాల కోసం బయటికి వెళ్లింది తల్లి. తాను తిరిగి వచ్చేసరికి బాలిక రిసెప్షన్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అసలు విషయం ఏంటని ఆరాతీయగా బాలిక తన తల్లికి ఏం జరిగిందో వివరించింది.

తాను స్విమ్మింగ్ పూల్‌లో ఆడుతున్న సమయంలో హోటల్ స్టాఫ్‌లోని ఓ యువకుడు తనతో పాటు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి తనను లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది బాలిక. ఆ తర్వాత అక్కడ నుండి తాను తప్పించుకోవాలని చూడగా.. తనను ఓ రూమ్‌లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి చెప్పగా వారు ఈ విషయం బయటికి రాకూడదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఆ బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది.

బాలికను అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు కర్ణాటకలోని తన సొంతూరుకు పారిపోయాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అక్కడే అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story