KPHB : భర్త అక్రమ సంబంధం .. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితక్కొట్టిన భార్య

KPHB :  భర్త అక్రమ సంబంధం .. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని   చితక్కొట్టిన భార్య
KPHB : కట్టుకున్నవాడి సూటిపోటి మాటల్ని భరించింది. టార్చర్ పెట్టినా సహించింది. తన కాపురం నెమ్మదిగా అయినా చక్కబడుతుందని ఎదురు చూసింది.

KPHB : కట్టుకున్నవాడి సూటిపోటి మాటల్ని భరించింది. టార్చర్ పెట్టినా సహించింది. తన కాపురం నెమ్మదిగా అయినా చక్కబడుతుందని ఎదురు చూసింది. చివరికి భర్త వెధవ వేషాలు తెలిసాక.. అందరి ముందు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని KPHBలో జరిగింది.

గుంటూరు జిల్లా పెదపరిమికి చెందిన ప్రకాష్‌కి అదే జిల్లాకు చెందిన త్రివేణితో 2019లో పెళ్లయ్యింది. 20 లక్షల నగదు, 30 సవర్ల బంగారం, 3 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చారు. ఐతే.. ప్రకాష్‌ పెళ్లైన నెల నుంచే త్రివేణిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అకారణంగా హింసించేవాడు. రాత్రిళ్లు కూడా సరిగ్గా ఇంటికి వచ్చేవాడు కాదు.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న భర్త రోజురోజుకూ సైకోలా టార్చర్‌ పెడుతుండడంతో ఓ దశలో సూసైడ్ ప్రయత్నం కూడా చేసింది త్రివేణి. ఇంతలోనే మరో మహిళతో భర్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసి షాకైంది. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. KPHBలోని తులసీ నగర్‌లో మరో మహిళ అతను ఉన్నప్పుడు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది.


Tags

Read MoreRead Less
Next Story