పెళ్లికి ముందే విశ్వరూపం.. యువతి నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. చివరికి

పెళ్లికి ముందే విశ్వరూపం.. యువతి నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. చివరికి
ఈ మధ్యే ఇండియాకు వచ్చిన కార్తీక్‌.. యువతితో వీడియో కాల్స్‌లో మాట్లాడేవాడు. నగ్నంగా వీడియోకాల్‌లో మాట్లాడమని ఇబ్బంది పెట్టాడు

పెళ్లికి ముందే నగ్న వీడియోలు తీసి పెళ్లికూతురు ఉసురు తీశాడో శాడిస్ట్. పేరుకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడనే గానీ.. నాగరికత మరిచిపోయి ప్రవర్తించి.. కట్టుకోబోయే అమ్మాయి ప్రాణాలు తీశాడు. 15 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెండ్యాలకు చెందిన యువతితో.. మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌కు చెందిన కార్తీక్‌కు నిశ్చితార్థం జరిగింది.

ఈ మధ్యే ఇండియాకు వచ్చిన కార్తీక్‌.. యువతితో వీడియో కాల్స్‌లో మాట్లాడేవాడు. నగ్నంగా వీడియోకాల్‌లో మాట్లాడమని ఇబ్బంది పెట్టాడు. కాబోయే భర్తే కదా అని తలవంచినందుకు.. ఆ తరువాత బెదిరించడం మొదలు పెట్టాడు. మాట్లాడుకున్న కట్నకానుకలు కాకుండా.. అడిగినంత ఇవ్వాలని పట్టుబట్టాడు. లేదంటే తనతో చనువుగా ఉన్న వీడియోలను బయటపెడతానని బెదిరించాడు.

తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి.. కట్నం ఎంతైనా వస్తుందంటూ అరాచకం సృష్టించాడు. దీంతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు యువతి తల్లిదండ్రులు. అయితే, ఈ అవమానం తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసిన కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story