కొంపముంచిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. అతిథిగా వచ్చి అందినకాడికి దోచేశాడు..!

కొంపముంచిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. అతిథిగా వచ్చి అందినకాడికి దోచేశాడు..!
సోషల్ మీడియాలో పరిచయాలు నేటి సమాజంలో ఎలాంటి పరిస్థుతులకి దారితీస్తున్నాయో అందరికీ తెలిసిందే..

సోషల్ మీడియాలో పరిచయాలు నేటి సమాజంలో ఎలాంటి పరిస్థుతులకి దారితీస్తున్నాయో అందరికీ తెలిసిందే.. గుడ్డిగా వారిని నమ్మితే ఏం జరుగుతుందో ఈ ఘటనే ఓ మచ్చుతునక అని చెప్పాలి. కామారెడ్డి జిల్లాకు చెందిన బానోతు సురేష్‌ అలియాస్‌ సన్నీ(22) హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో మూసాపేటకి చెందిన ఓ ఇంటర్ విద్యార్ధినితో పరిచయం ఏర్పడింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పలుమార్లు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు.. ఈ క్రమంలో గతనెల 20న అమ్మాయి తల్లిదండ్రులు ఊరెళ్లడంతో అతనికి ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించింది ఆ యువతి.. అయితే అతనిని ఇంట్లోనే కూర్చోమని చెప్పి కూల్ డ్రింక్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. దీనినే అదునుగా భావించిన అతను.. ఆ యువతి ఇంట్లో ఉన్న 20 తులాల నగలు, రూ.10 వేలతో జేబులో దాచుకున్నాడు.

ఆ తర్వాత కాసేపు మాట్లాడి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకి తెలియడంతో ఈ నెల 1న కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన పోలీసులు సురేష్ ని అదుపులోకి తీసుకొని నగలను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story