లేడీ కాదు బాబోయ్.. మహా కిలాడీ.. ఎంత పని చేసిందంటే..!

తన తల్లిదండ్రులరకు తాను ఏకైక సంతానమని అధికారులను నమ్మించి.. ఏకంగా అయిదు కోట్ల రూపాయల విలువైన అస్తులను విక్రయించిన ఓ మహిళ బండారం బట్టబయలైంది..

లేడీ కాదు బాబోయ్.. మహా కిలాడీ.. ఎంత పని చేసిందంటే..!
X

తన తల్లిదండ్రులరకు తాను ఏకైక సంతానమని అధికారులను నమ్మించి.. ఏకంగా అయిదు కోట్ల రూపాయల విలువైన అస్తులను విక్రయించిన ఓ మహిళ బండారం బట్టబయలైంది.. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల పట్టణంలోని కోటావీధికి చెందిన అవుకు రమాదేవి అనే మహిళ.. తన తల్లి ఎల్ల నర్సమ్మకు తాను ఏకైక సంతానమని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకొని ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందింది.

వాస్తవానికి నర్సమ్మకు రమాదేవితో పాటు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ విషయాన్నీ దాచి పెట్టి ఆ సర్టిఫికెట్‌ ను చూపించి ఆమె తల్లికి సంబంధించిన అస్తులను వేరే వాళ్ళపైన రిజిస్ట్రేషన్లు‌ చేయించింది. ఏ విషయమైన ఎదో ఒకరోజున బయట పడాల్సిందే కదా అన్నట్టుగా రమాదేవి దాచి పెట్టిన భూములను రిజిస్ట్రేషన్లు‌ చేసిన విషయం తహసీల్దార్‌కు తెలిసిపోయింది. దీనితో రమాదేవిని గత ఏడాది నవంబర్ లో పిలిపించి విచారణ చేశారు. అయితే ఈ విచారణలో తనకి ముగ్గురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నట్టుగా రమాదేవి ఒప్పుకుంది.

అంతేకాకుండా జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ రద్దు చేయమని రాత పూర్వకంగా రాసి ఇచ్చింది. అనంతరం ఆమె ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన మాదిరెడ్డి తిరుమలేశ్వరరెడ్డి, చిట్టెపు మద్దిలేటిరెడ్డి, బనగానపల్లెకు చెందిన వెంకట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌బీఐ కాలనీకి చెందిన సీతారామిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డిలకు డిసెంబర్‌ 30వ తేదీన విలువైన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ తప్పుడు సర్టిఫికెట్‌తో రిజిస్ట్రేషన్లు చేస్తుందని రమాదేవి పైన కేసు నమోదు చేయాలని టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కిలాడీ పైన ఐపీసీ సెక్షన్‌ 177, 182, 199, 420, 419 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES