Real Love Story : సినిమాని మించిన లవ్ స్టోరీ.. !

Real Love Story :  సినిమాని మించిన లవ్ స్టోరీ.. !
Real Love Story : సెల్వన్ అనే యువకుడు, ఇళమతి అనే యువతి ఇద్దరు కొలీగ్స్... పనిచేసేది ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమకి దారి తీసింది..

సెల్వన్ అనే యువకుడు, ఇళమతి అనే యువతి ఇద్దరు కొలీగ్స్... పనిచేసేది ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమకి దారి తీసింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు... కానీ కులాలు వేరు కావడంతో పెద్దలు కాదన్నారు.

కన్నవాళ్లను కాదనుకుని బయటకు వచ్చి కలిసి బ్రతకాలని అనుకున్నారు.. అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకొని ఓ చోట కాపురం పెట్టారు.. ఓ నెల రోజులు అంతాబాగానే ఉంది. కానీ ఓ రోజు యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. దీనితో తీవ్ర మనోవేదనకి గురైన సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు.

అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి ఇళమతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల ఉండడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని సెల్వన్ ఆరోపించాడు. ఈ క్రమంలో తనని చంపాలని చూస్తున్నారని ఇళమతి ఇటీవల వాట్సాప్‌లో మెసేజ్ చేయడంతో యువకుడు మీడియాని ఆశ్రయించాడు.

దీనితో ఇష్యూ పెద్దది కావడంతో తన భార్యకు ప్రాణహాని ఉందని ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story