రైల్వేశాఖలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

రైల్వేశాఖలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

సికింద్రాబాద్‌ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం కలకలం రేపుతోంది. నకిలీ బిల్లులు సృష్టించి రూ.2.20 కోట్లు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వేశాఖలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించినట్టు అధికారుల దృష్టికి వచచింది. వెంటనే దీనిపై విచారణ జరిపిన అధికారులు.. నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించిన కుంభకోణంలో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేశారు. రైల్వే అకౌంట్స్ అసిస్టెంట్ గణేశ్‌కుమార్, సాయిబాలాజీ ఫార్మా, వినాయక ఏజెన్సీ, తిరుమల ఏజెన్సీలపై కేసులు నమోదయ్యాయి. రైల్వే విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story