Kerala : బాలిక ప్రాణం తీసిన షావర్మా.. మరో 18 మంది ఆసుపత్రి పాలు..!

Kerala :  బాలిక ప్రాణం తీసిన షావర్మా.. మరో 18 మంది ఆసుపత్రి పాలు..!
Kerala : కేరళలోని ఫుడ్ స్టాల్‌లో షావర్మా తిన్న ఓ 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఫుడ్‌‌పాయిజన్‌తో మరణించింది.

Kerala : కేరళలోని ఫుడ్ స్టాల్‌లో షావర్మా తిన్న ఓ 17 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఫుడ్‌‌పాయిజన్‌తో మరణించింది. మరణించిన విద్యార్ధినిని దేవానంద(16)గా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలోని కాసర్‌గోడ్ జిల్లా చెరువత్తూరులో చోటుచేసుకుంది. మరో 18 మంది ఆదివారం ఆసుపత్రి పాలయ్యారు. అయితే వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు తెలిపారు.

తమ స్కూల్ పక్కనే ఉన్న ఓ హోటల్ లో విద్యార్థులు ఈ షావర్మా తిన్నారు. కాసేపటికే అక్కడే జ్యూస్ కూడా కూడా తాగారు. అయితే వారందరూ అస్వస్థత‌కు గురవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో దేవానంద్ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం సదరు హోటల్ పైన కేసు పెట్టారు. ఆ హోటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టారు.


కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి ఎంవీ గోవిందన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లలో నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని చెప్పారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాల్సిందిగా ఆహార భద్రత కమిషనర్‌ను ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం ఆదేశించారు. బాధిత ప్రజలకు సరైన వైద్యం అందేలా చూడాలని డీఎంవోను ఆదేశించారు.

విచారణ నివేదిక ఆధారంగా షాపుపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. షావర్మా నిజానికి ఒక లెవాంటైన్ వంటకం, మాంసాన్ని సన్నని ముక్కలుగా కట్ చేస్తారు.. ఇది చాలా సంవత్సరాలుగా కేరళ అంతటా ప్రసిద్ధి చెందింది.

Tags

Read MoreRead Less
Next Story