Kerala: కొడుకు కుటుంబంపై పగ.. నిప్పంటించిన తండ్రి

Kerala: కొడుకు కుటుంబంపై పగ.. నిప్పంటించిన తండ్రి
Kerala: కన్న తండ్రి కర్కోటకుడయ్యాడు.. ఆస్తి కోసం కొడుకు, కోడలు, ఇద్దరు చిన్నారులను అగ్నికి ఆహుతి చేశాడు.

Kerala: కన్న తండ్రి కర్కోటకుడయ్యాడు.. ఆస్తి కోసం కొడుకు, కోడలు, ఇద్దరు చిన్నారులను అగ్నికి ఆహుతి చేశాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని తొడుపుజా సమీపంలోని చీనికుజిలో జరిగింది.

చీనిక్కుజిలోని అలియక్కున్నెల్‌కు చెందిన హమీద్ (79)ను ఇరుగుపొరుగు బంధించి పోలీసులకు అప్పగించారు. ముహమ్మద్ ఫైజల్ (49), అతని భార్య షీబా (39), కుమార్తెలు మెహ్రూ (16), అస్నా (13) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తొడుపుజ జిల్లా ఆసుపత్రికి తరలించనున్నారు.

ఆస్తి తగాదా హత్యకు దారితీసిందని పోలీసు అధికారి తెలిపారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం, హమీద్ కుటుంబం పడుకుందని నిర్ధారించుకున్న తర్వాత కొడుకు ఫైజల్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబం బయటకు రాకుండా ఉండేందుకు బయటి నుంచి తలుపులు వేసి, వాటర్ ట్యాంక్‌లోని నీటిని కూడా ఖాళీ చేశాడు.

అర్ధరాత్రి ఆదమరచి నిద్ర పోతున్న వారికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో సాయం కోసం పొరుగువారికి ఫోన్ చేసినప్పటికీ ఎవరూ రావడానికి వీల్లేదన్నాడు హమీద్. ఎవరైనా సాయం అందించేందుకు ముందుకు వస్తే తనకు తాను నిప్పంటించుకుంటానని బెదిరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రెస్క్యూ టీమ్ రావడం ఆలస్యం అవడంతో ఫైజల్ కుటుంబం మంటల్లో కాలిపోయింది. గత కొన్నేళ్లుగా హమీద్ తన రెండో భార్యతో ఉంటున్నాడు. ఇటీవల రెండో భార్య విడిచిపెట్టి వెళ్లిపోవడంతో కొడుకు ఫైజల్ తో కలిసి ఉంటున్నాడు.

అయితే తండ్రీ కొడుకులకు ఆస్తి విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు స్థానిక మసీదు అధికారులు, కుటుంబ సభ్యులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

పథకం ప్రకారం దారుణ హత్య

శుక్రవారం రాత్రి, ఫైజల్ మరియు అతని కుటుంబం పడుకోవడానికి, హమీద్ బయటి నుండి తలుపు తాళం వేసి, వాటర్ ట్యాంక్ నుండి నీటిని తీసివేసి, విద్యుత్ తీగలను తెంచుకున్నాడు. అనంతరం ఫైజల్ గది కిటికీ తెరిచి వారి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పథకం ప్రకారం ట్యాంకర్ లో నీళ్లు కూడా ఖాళీ చేశాడు. కళ్ల ముందే కొడుకు కుటుంబం సజీవ దహనం అయింది. పోలీసులు హమీద్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story